- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India A vs Australia A: అస్ట్రేలియా ఏ మ్యాచ్ లో రాణించిన దృవ్ జురెల్..మళ్లీ విఫలమైన కేఎల్ రాహుల్
దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా(Australia)తో టెస్టు సిరీస్ కు సిద్దమయ్యే క్రమంలో ఆస్ట్రేలియా ఏ(Australia A), ఇండియా ఏ(India A )జట్ల మధ్య సాగుతోన్న అనధికార టెస్టు మ్యాచ్ లు టీమిండియాలోని పలువురు ఆటగాళ్లకు పరీక్షగా మారాయి. ఆసీస్ ఏ జట్టుతో అనధికారిక రెండో టెస్టు(2nd unofficial Test)లో బరిలోకి దిగిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి విఫలమై పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తెలుగు తేజం నితీశ్ రెడ్డి(16) పరుగలకే ఔట్ కాగా, వికెట్ కీపర ధ్రువ్ జురెల్ మాత్రం (80) అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. 11 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియాను ధ్రువ్, దేవదత్ పడిక్కల్ జోడీ ఆదుకుంది. 64పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో జురెల్ తన పోరాట పటిమతో భారత్ ను ఆదుకున్నాడు. అతడితో పాటు దేవదత్ పడిక్కల్ (26), ప్రసిద్ కృష్ణ (14) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 161 పరుగులకే ఆలౌటైంది.
భారత బ్యాటర్లలో అభిమన్యు ఈశ్వరన్ (0), సాయి సుదర్శన్, తనుష్ కొటియన్ (0) డకౌట్ కాగా.. కెప్టెన్ రుతురాజ్ (4), కేఎల్ రాహుల్ (4), ఖలీల్ అహ్మద్ (1), ముకేశ్ కుమార్ (5*) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో భారత్ ఏ జట్టు ఆటగాళ్లు తడబడ్డారు. వరుస వికెట్లు కోల్పోగా, చివర్లో ప్రసిద్ కృష్ణ నిలబడటంతో టీమ్ ఇండియా స్కోరు 161పరుగులతో ఓ మోస్తారు స్కోరు సాధించింది. ఆసీస్ బౌలర్లు నెసెర్ 4, వెబర్.. బొలాండ్, స్వీనే, రోచీ ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం అసీస్ ఏ జట్టు రెండు వికెట్లకు 56పరుగులతో ఆడుతోంది. ముఖేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ సాధించారు.