- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీమిండియాకు లక్కీ ప్లేయర్... అతను ఆడితే అన్ని విజయాలే !
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొన్నటి వరకు ఐదు టెస్టుల సిరీస్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొన్నటి వరకు ఐదు టెస్టుల సిరీస్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా అద్భుతంగా రాణించి... సిరీస్ సమం చేసింది. అయితే ఇలాంటి నేపథ్యంలో... టీమిండియా లక్కీ ప్లేయర్ ధృవ్ జురెల్ అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అతను జట్టు కోసం పెద్దగా పరుగులు చేయకపోయినా... కీపింగ్ చేస్తూ క్యాచులు వదిలేసినా... టీమిండియా కు మాత్రం మేలు జరుగుతుందని అంటున్నారు.
జురెల్ ఆడిన గత టెస్ట్ మ్యాచ్ లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకు అతను ఆడిన ఐదు టెస్టుల్లో కూడా టీమిండియా విజయం సాధించింది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రాజ్ కోట్ వేదికగా... జరిగిన మ్యాచ్ లో కూడా టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆ తర్వాత రాంచి వేదికగా కూడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే... టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇక ధర్మశాల వేదికగా కూడా జరిగిన మ్యాచ్ లో జురెల్ ఆడాడు. అతని లక్కీ హ్యాండ్ కారణంగా టీమిండియా 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక మొన్న పెద్ద వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా టీమిండియా విజయం సాధించింది. లేటెస్ట్ గా ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన ఓవల్ టెస్ట్ లో కూడా గిల్ సేన విజయం సాధించింది. ఇలా జురెల్ ఆడిన ప్రతి మ్యాచ్ విజయం సాధించింది టీమిండియా.






