- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025: వివాదంలో ధోని ఔట్... నాటౌట్ అంటూ రచ్చ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ జరిగిన కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కిం

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ జరిగిన కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ లో ఓ వివాదాస్పద సంఘటన జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni)... నాటౌట్ అయినా కూడా ఔట్ ఇచ్చారని... సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సునీల్ నరైన్ బౌలింగ్ లో LBW అయ్యాడు మహేంద్ర సింగ్ ధోని. నాలుగు బంతులు ఆడిన మహేందర్ సింగ్ ధోని... ఒకే ఒక్క పరుగు చేసి... వికెట్ సమర్పించుకున్నాడు. అయితే సునీల్ నరైన్ బౌలింగ్ లో ఎల్బీ అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ ఇచ్చారు.
ఈ తరుణంలోనే మహేంద్ర సింగ్ ధోని రివ్యూ కోరారు. అయినప్పటికీ థర్డ్ అంపైర్ కూడా... మహేంద్ర సింగ్ ధోని ఔట్ అంటూ ప్రకటించారు. అయితే రీప్లేలో బంతి బ్యాట్ పక్క నుంచి వెళ్తున్న క్రమంలో... ఆల్ట్రా ఎడ్జ్ లో కాస్త హెచ్ తగ్గులు ఉన్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ తరుణంలో... క్లియర్ ఎడ్జ్ అయిందని... మహేంద్ర సింగ్ ధోని నాటౌట్ అంటూ... సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అభిమానులు.
కానీ థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో... పెవిలియన్ కు మహేంద్ర సింగ్ ధోని వెళ్లిపోయాడు. ఇది ఇలా ఉండగా ఇవాల్టి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఓడిపోయింది. కేకేఆర్ చేతిలో ఏకంగా 8 వికెట్ల తేడాతో చెన్నై... దారుణ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్స్ నష్టపోయి 103 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం చేజింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 10.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి.. లక్ష్యాన్ని చేదించి విజయం సాధించింది.






