- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MS Dhoni: పెద్దయనే కానీ.. 43ఏళ్ల వయసులో ఎవరికీ సాధ్యంకాని రికార్డు మహేంద్రుడి సొంతం!

దిశ, వెబ్ డెస్క్: MS Dhoni: మహేంద్రసింగ్ ధోనీ..అభిమానులు ముద్దుగా ఎంఎస్ ధోనీ అని పిలుకుంటారు. ఆయన తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా సోమవారం లఖ్ నవూ సూపర్ జెయింట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ కు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన లఖ్ నవూ 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తర్వాత ఛేదన ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులుచేసింది. ఇల లఖ్ నవూ సూపర్ జెయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది.
ఈ విజయంలో ధోనీ కీలకపాత్ర పోషించాడు. తన బ్యాటింగ్ తో కేవలం 11 బంతుల్లోనే 26 పరుగులు చేసి వావ్ అనిపించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఐపీఎల్ లో 11 ఏళ్ల రికార్డును తిరగరాశాడు ధోని. ధోనీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును 43 ఏళ్ల 280 రోజుల్లో గెలుచుకుని రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఈ అవార్డు గెలుచుకున్న అతిపెద్ద వయస్కుడిగా ధోని నిలిచాడు. ఈ రికార్డు అంతకముందు ప్రవీణ్ తాంబే పేరు మీద ఉంది. అతను 2014 ఐపీఎల్ సీజన్ రాజస్థాన్ రాయల్స్ తరపును ఆడుతూ కోల్ కతా నైట్ రైడర్స్ పై 42 ఏళ్ల 208 రోజుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.