రోహిత్, కోహ్లీకి మద్దతుగా నిలిచిన ధావన్.. వారి సామర్థ్యాలపై అనుమానాలు అక్కర్లేదని కామెంట్

by Harish |

ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ మద్దతుగా నిలిచాడు.

రోహిత్, కోహ్లీకి మద్దతుగా నిలిచిన ధావన్.. వారి సామర్థ్యాలపై అనుమానాలు అక్కర్లేదని కామెంట్
X

దిశ, స్పోర్ట్స్ : ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ మద్దతుగా నిలిచాడు. వారి సామర్థ్యాలపై అనుమానాలు అక్కర్లేదని, తిరిగి పుంజుకుంటారని తెలిపాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ మాట్లాడుతూ..‘విరాట్, కోహ్లీ ఇద్దరూ వరల్డ్ క్లాస్ ప్లేయర్లు. ప్రస్తుతం వారు ఆటలో దిగ్గజాలుగా ఉన్నారు. వారి శక్తి సామర్థ్యాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ప్లేయర్ ఏదో ఒక సమయంలో ఈ పరిస్థితి ఎదుర్కొంటాడు. కొన్ని చెడ్డ ప్రదర్శనలు ఉండొచ్చు. కానీ, అవి వారి సామర్థ్యాన్ని మార్చవు. రోహిత్, కోహ్లీ ఏం చేయగలరో మనకు తెలుసు. పదే పదే వారు నిరూపించుకున్నారు. వారిద్దరూ బలంగా పుంజుకుని తిరిగి వస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు.’ అని ధావన్ చెప్పుకొచ్చాడు.


Next Story