- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కూతుర్ని చూస్తుంటే గర్వంగా ఉంది..విడాకులపై ధనశ్రీ తల్లి సంచలనం !
చాహల్ ( Chahal) మాజీ భార్య ధనశ్రీ వర్మ ( Dhanashree Verma) తల్లి వర్ష వర్మ ( Varsha verma).. సంచలన వ్యాఖ్యలు చేసింది. త

దిశ, వెబ్ డెస్క్: చాహల్ ( Chahal) మాజీ భార్య ధనశ్రీ వర్మ ( Dhanashree Verma) తల్లి వర్ష వర్మ ( Varsha verma).. సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కూతురిని చూస్తే ఎంతో గర్వంగా ఉందని... ఆమె ఏ నిర్ణయం తీసుకున్న... మాకు అంగీకారమే అంటూ బాంబు పేల్చింది. తాజాగా ముంబై లో (Mumbai) ధన శ్రీ వర్మ అలాగే ఆమె తల్లి వర్ష వర్మ ఇద్దరు కలిసి షాపింగ్ చేశారు. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్ కు సంబంధించిన వ్యక్తి... ధనశ్రీ వర్మ తల్లిని మాట్లాడించే ప్రయత్నం చేశాడు.
మీ కూతురి లైఫ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అని సదరు జర్నలిస్టు... వర్ష వర్మను అడిగారు. దీంతో వెంటనే ఆన్సర్ ఇచ్చింది వర్ష వర్మ. తన కూతురు అంటే తమకు చాలా ఇష్టమని పేర్కొంది. ధన శ్రీ వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకున్న మాకు అంగీకారమే అని వెల్లడించింది. ఆమె జీవితంలో తీసుకున్న... విడాకుల నిర్ణయాన్ని కూడా తాము అంగీకరించినట్లు ఆమె చెప్పకనే చెప్పారు. ధన శ్రీ వర్మ ఇండిపెండెంట్ ఉమెన్ అని... ఆమె నిర్ణయాలు తమకు నచ్చుతాయని తెలిపింది.
దీంతో ధనశ్రీ వర్మ తల్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా... గత రెండు నెలల కిందట ధనశ్రీ వర్మ అలాగే చాహల్ ఇద్దరు విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ముంబై ఫ్యామిలీ కోర్టు విడాకులు ( divorce) మంజూరు చేసింది. విడాకులు మంజూరు అయిన తర్వాత దాదాపు నాలుగు కోట్లకు పైగా... భరణం కూడా ఇచ్చాడు చాహల్. అనంతరం ఐపిఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ ప్రారంభించాడు చాహల్. ప్రస్తుతం మరో అమ్మాయితో కూడా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.






