- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chahal-Dhanashree: ధనశ్రీకి రూ.4.75 కోట్లు భరణం.. ఇచ్చేందుకు క్రికెటర్ చాహల్ సిద్దం!
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, నటి-కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ జంట విడాకుల తీసుకోబోతున్నారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత క్రికెటర్ (Yuzvendra Chahal) యుజ్వేంద్ర చాహల్, నటి-కొరియోగ్రాఫర్ (Dhanashree) ధనశ్రీ వర్మ జంట విడాకుల తీసుకోబోతున్నారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ జంట విడాకుల విచారణ మార్చి 20న జరుగుతుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చాహల్ పాల్గొంటున్నందున, మార్చి 20 (గురువారం) చాహల్, ధనశ్రీ విడాకుల కేసును విచారించాలని బాంబే హైకోర్టు ఇవాళ ఫ్యామిలీ కోర్టును ఆదేశించిందని బార్ అండ్ బెంచ్ నివేదించింది. ఇద్దరు విడాకులకు సంబంధించి ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను మినహాయిస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.
అయితే ఫిబ్రవరి 5న చాహల్, ధన శ్రీ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారని తెలిసింది. విచారణలో భాగంగా ధన శ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు సమాచారం. ఆ సమయంలో అతను రూ. 2.37 కోట్లు చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. సెటిల్‌మెంట్ నిబంధనలను పాక్షికంగా మాత్రమే పూర్తి చేశాడని కోర్టు గుర్తించిందని బార్ అండ్ బెంచ్ నివేదించింది. విడాకుల పిటిషన్‌పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. కాగా, భరణంకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
Read More..
French woman: మోక్షం పేరుతో కొండపైకి తీసుకుకెళ్లి ఫ్రెంచ్ మహిళపై అత్యాచారయత్నం






