క్రికెట్‌లో షాకింగ్ ఘటన.. మైదానంలోనే కుప్పకూలిన కోచ్

by Harish |

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

క్రికెట్‌లో షాకింగ్ ఘటన.. మైదానంలోనే కుప్పకూలిన కోచ్
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఢాకా క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ హఠాన్మరణం చెందారు. బీపీఎల్‌లో భాగంగా శనివారం ఢాకా క్యాపిటల్స్, రాజ్‌షాహి రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు మహబూబ్ అలీ మైదానంలోనే కుప్పకూలిపోయారు. అప్పటివరకు 59 ఏళ్ల జాకీ మైదానంలో బాగానే ఉన్నారు. పిచ్ పరిశీలించారు.

మరికాసేపట్లో గేము ప్రారంభంకానుండగా ఆకస్మికంగా ఆయన కుప్పకూలారు. వెంటనే జట్టు సిబ్బంది, వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే జాకీ మృతి చెందారు. జాకీ మరణించినట్టు బంగ్లాదేశ క్రికెట్ బోర్డు(బీసీబీ) చీఫ్ ఫిజిషీయన్ దేబాశిష్ చౌదరి ధ్రువీకరించారు. జాకీ మరణానికి గల కచ్చితమైన వెల్లడించలేదు. అయితే, ఇంతకుముందు ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఢాకా జట్టు సిబ్బంది తెలిపారు. మహబూబ్ జాకీ అలీ మరణం బంగ్లా క్రికెట్‌‌‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన జాకీ బంగ్లాదేశ్ దేశవాళీ క్రికెట్‌లో మంచి గుర్తింపు పొందాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా మారాడు. 2008లో బీసీబీలో హై ఫర్పామెన్స్ కోచ్‌గా చేరాడు.


Next Story