వీడు మామూలోడు కాదు.. ఒకే ఒక్క మ్యాచ్ తో 81 స్థానాలు ఎగబాకాడు

by velandi.Saikiran |

102 వ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్.. ఉన్నాడు. సెంచరీ చేసిన తర్వాత అతని ప్రస్తుత ర్యాంకు 21గా ఉంది

వీడు మామూలోడు కాదు.. ఒకే ఒక్క మ్యాచ్ తో 81 స్థానాలు ఎగబాకాడు
X

దిశ, వెబ్ డెస్క్: సౌత్ ఆఫ్రికా డేంజర్ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ ( Dewald Brevis) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బేబీ AB గా పిలువబడే డెవాల్డ్ బ్రెవిస్... ఆస్ట్రేలియాపై ఇరగదీస్తున్నాడు. తాజాగా సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు ఈ డేంజర్ ప్లేయర్. ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య తాజాగా టీ20 మ్యాచ్ జరిగింది. ఈ రెండు టి20 మ్యాచ్ లో ఏకంగా 125 పరుగులు చేసి రఫ్ ఆడించాడు డెవాల్డ్ బ్రెవిస్.

ఈ సెంచరీ తో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టి20 వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టు తరఫున సెంచరీ కొట్టిన చిన్న వయసు ఉన్న ప్లేయర్ గా డెవాల్డ్ బ్రెవిస్ సరికొత్త రికార్డులు సృష్టించాడు. అయితే ఈ ఒక్క సెంచరీ తో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో... ఏకంగా 81 స్థానాలు ఎగబాగాడు.

ఈ సెంచరీ కంటే ముందు 102 వ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్.. ఉన్నాడు. సెంచరీ చేసిన తర్వాత అతని ప్రస్తుత ర్యాంకు 21గా ఉంది. అంటే 80 కి పైగా స్థానాలు ఎగబాకి 21 స్థానానికి చేరుకున్నాడు. ఇలా ఒకేసారి ర్యాంకింగ్ లో దూసుకు వెళ్లడం మొదటి సారి అని అంటున్నారు. ఇక ఇదే టి20 ర్యాంకింగ్స్ లో టీమిండియా డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు రెండో స్థానంలో తిలక్ వర్మ ఉన్నాడు.

Next Story