- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో వన్డేలో హర్షిత్ రాణా ఓవరాక్షన్..వికెట్ తీసి రెచ్చిపోయాడు!
న్యూజిలాండ్ ఓపెన్ డేవాన్ కాన్వే 16 పరుగుల వద్ద హర్షిత్ రాణా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండవ వన్డేలో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఓవరాక్షన్ చేశాడు. వికెట్ తీసిన తర్వాత వేలు చూపిస్తూ రెచ్చిపోయాడు. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 284 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పోరాడుతోంది న్యూజిలాండ్. 15 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్ 70కి పైగా పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.
అయితే న్యూజిలాండ్ ఓపెన్ డేవాన్ కాన్వే 16 పరుగుల వద్ద హర్షిత్ రాణా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సందర్భంగా హర్షిత్ రాణా ఓవర్ గా రియాక్ట్ అయి.. కాన్వేను కించపరిచేలా వ్యవహరించాడు. దీంతో హర్షిత్ పై ఇండియన్ ఫాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ అండా దండలతో, హర్షిత్ ఇలా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాడని మండిపడుతున్నారు.
సెంచరీతో దుమ్ము లేపిన KL రాహుల్
న్యూజిలాండ్ తో జరిగిన రెండవ వన్డేలో కేఎల్ రాహుల్, ది గ్రేట్ వాల్ ద్రావిడ్ లాగా ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 92 బంతులు ఎదుర్కొని 112 పరుగులు సాధించాడు రాహుల్. భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు.






