ఆ స్టేడియం కూల్చివేత?.. ఎందుకో తెలుసా?

by Harish |

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రు స్టేడియాన్ని కూల్చబోతున్నట్టు ఓ వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ స్టేడియం కూల్చివేత?.. ఎందుకో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రు స్టేడియాన్ని కూల్చబోతున్నట్టు ఓ వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ స్టేడియాన్ని కూల్చేవేసి 102 ఎకరాల్లో కొత్త స్పోర్ట్స్ సిటీని నిర్మించబోతున్నారని ఆ వార్తల సారాంశం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. జేఎల్‌ఎస్ స్టేడియాన్ని కూల్చేవేసి అన్ని రకాల క్రీడా మౌలిక సదుపాయాలతో కూడిన అత్యాధునిక స్పోర్ట్స్ సిటీని నిర్మించనున్నట్టు క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి. ఇప్పటికే అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మేజర్ గ్లోబల్ ఈవెంట్స్‌ నిర్వహించేలా ఖతార్,ఆస్ట్రేలియాలో నిర్మాణాలు చేపట్టారు. వాటి నమూనాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

స్పోర్ట్స్ సిటీలో ఉన్నత శిక్షణా సౌకర్యాలు, అప్‌గ్రేడ్ చేసిన వేదికలు, అథ్లెట్ల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో హై పర్ఫామెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. 1982 ఆసియా క్రీడల కోసం జవహర్‌లాల్ నెహ్రు స్టేడియాన్ని నిర్మించారు. 2010 కామన్వెల్త్ క్రీడల కోసం పునరుద్ధరించారు. దేశంలో అత్యంత ప్రసిద్ధ బహుళ ఈవెంట్ల వేదిక ఇది. మేజర్ అథ్లెటిక్స్ ఈవెంట్స్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లకే కాకుండా కచేరీలు, స్వాతంత్ర్య దినోత్సవంలాంటి జాతీయ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ స్టేడియం సామర్థ్యం 60 వేల మంది. ఈ ఏడాది స్టేడియంలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరిగిన విషయం తెలిసిందే.


Next Story