- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Virat Kohli : ఢిల్లీ గెలిచింది..విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మిస్ !
ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రైల్వేస్ - ఢిల్లీ(Railways - Delhi)రంజీ మ్యాచ్ (Ranji match)లో ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు ఓవర్ నైట్ 334/7 స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన దిల్లీ 374 పరుగులకు ఆలౌటైంది.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రైల్వేస్ - ఢిల్లీ(Railways - Delhi)రంజీ మ్యాచ్ (Ranji match)లో ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు ఓవర్ నైట్ 334/7 స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన దిల్లీ 374 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 133 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన రైల్వేస్ 114 పరుగులకే ఆలౌటైంది. దీంతో విరాట్ కోహ్లికి రెండో సారి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దాదాపుగా 13ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లి రంజీ మ్యాచ్ ఆడటంతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 15బంతులాడి 6పరుగులకే అవుటైన విరాట్ కోహ్లీ తన ఆట చూసేందుకు స్టేడియానికి వేలాదిగా వచ్చిన అభిమానులను నిరాశ పరిచాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు ఫామ్ కోసం రంజీ మ్యాచ్ ఆడిన కోహ్లీ వైఫల్యాల ఆట తీరు మారలేదు.
ఇక ఢిల్లీ రెండో ఇన్నింగ్స్ లోనైనా విరాట్ బ్యాటింగ్ చూడోచ్చన్న అభిమానుల ఆశలకు గండి కొడుతూ ఢిల్లీ బౌలర్లు రెచ్చిపోయి రైల్వేస్ ను ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 114పరుగులకే ఆలౌట్ చేసేశారు. ఢిల్లీ బౌలర్లలో శివం శర్మ 5 వికెట్లు సాధించాడు. దీంతో ఢిల్లీ రెండో ఇన్నింగ్స్ ఆడకుండానే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత మేరకు 19పరుగులతో గెలిచింది. ఇక ఢిల్లీ రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం లేకపోవడంతో విరాట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే విరాట్ ఫీల్డింగ్ చూసి సరిపెట్టుకున్నారు.
కాగా మైదానంలో కోహ్లి పీల్డింగ్ చేస్తుండగా ముగ్గురు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. కోహ్లి పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. తొలి రోజు ఆటలోనే ఓ అభిమాని ఇలాగే చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ గా మారాయి. మూడో రోజు కూడా అభిమానులు కోహ్లీకి పాదాభివందనం చేసేందుకు మైదానంలోకి చొచ్చుకురాగా వెంటనే గ్రౌండ్ సిబ్బంది, పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటన భద్రతా వైఫల్యాలను చాటిందన్న విమర్శలు చోటుచేసుకున్నాయి. టీమిండియా స్టార్ ప్లేయర్ ఆడుతుండటం..ఆయక కోసం వేలాది అభిమానులు తరలిరావడం తెలిసినా ఢిల్లీ క్రికెట్ సంఘం, పోలీస్ శాఖ సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు గురవుతోంది.






