DC vs RR : ఢిల్లీ వర్సెస్ రాజస్తాన్ మ్యాచ్ టై.. చివరికి విజయం ఎవరిదంటే?

by Muthe.Rajitha |   (  Updated:2025-04-16 18:26:08  IST  )

ఉత్కంఠత మ్యాచ్ లో ఢిల్లీ వర్సెస్‌ రాజస్థాన్‌(DC vs RR) మ్యాచ్‌ టై అయింది.

DC vs RR : ఢిల్లీ వర్సెస్ రాజస్తాన్ మ్యాచ్ టై.. చివరికి విజయం ఎవరిదంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్కంఠత మ్యాచ్ లో ఢిల్లీ వర్సెస్‌ రాజస్థాన్‌(DC vs RR) మ్యాచ్‌ టై అయింది. ఢిల్లీ 188/5, రాజస్థాన్‌ 188/4 స్కోర్లు సాధించగా.. సూపర్ ఓవర్(Super Over) నిర్వహించారు. చివరకు విజయం ఢిల్లీని వరించింది. ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్, రాజస్థాన్ రాయల్స్(DC vs RR) జట్లు తలపడ్డాయి. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగుకు దిగిన రాజస్తాన్ తీవ్రంగా పోరాడింది. అయినప్పటికీ ఇరు జట్లు సమాన స్కోర్ సాధించడంతో నిర్వహకులు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ ఓవర్ లో రాజస్తాన్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు సాధించగా.. ఢిల్లీ జట్టు 4 బంతుల్లోనే 13 పరుగులు సాధించి విజయం సొంతం చేసుకుంది. కాగా ఈ సీజన్లో సూపర్ ఓవర్ ఆడటం మ్యాచ్ ఇదే తొలిసారి.

Next Story