టీమిండియా పేరును BCCI వాడొద్దని పిల్.. కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

by Kema Shiva Kumar |

బీసీసీఐ (BCCI) నేతృత్వంలోని క్రికెట్ జట్టును టీమిండియా (Team India) పేరుతో పిలవొద్దని, ఆ పేరు వాడొద్దని అడ్వొకేట్ రీపక్ కన్సాల్ (Repak Consul) ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)లో పిటిషన్ ధాఖలు చేశారు.

టీమిండియా పేరును BCCI వాడొద్దని పిల్.. కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ (BCCI) నేతృత్వంలోని క్రికెట్ జట్టును టీమిండియా (Team India) పేరుతో పిలవొద్దని, ఆ పేరు వాడొద్దని అడ్వొకేట్ రీపక్ కన్సాల్ (Repak Consul) ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)లో పిటిషన్ ధాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గెడెలా డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ రీపక్ కన్సాల్ తన వాదనలు వినిపిస్తూ.. దూరదర్శన్ (Doordarshan), ఆలిండియా రేడియో (All India Radio)ను నిర్వహించే ప్రసార భారతి సంస్థలలో బీసీసీఐ జట్టును జాతీయ జట్టుగా చిత్రీకరించకుండా నిరోధించాలన్నారు. ఈ క్రమంలోనే ధర్మాసనం, పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయం వృథా చేయాడానికే పిటిషన్ దాఖలు చేశారా అని మండిపడింది.

కాగా, నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ జాతీయ క్రీడా జట్టు నిర్వహించబడుతుందో న్యాయమూర్తులు పిటిషనర్‌ను చెప్పాలన్నారు. కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్, హాకీ, ఫుట్‌బాల్, టెన్నిస్‌లో పాల్గొనే క్రీడాకారులు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదా అని ప్రశ్నించారు. రాజ్యంగంలోని ఆర్టికల్-12 ప్రకారం ఓ జట్టును ఇండియా అని పిలవడం లేదా జాతీయ జెండాను ఉపయోగించడం, 1950 ఎంబ్లెమ్స్ అండ్ నేమ్స్ (ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రాపర్ యూస్) యాక్ట్, 1950-ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002 ఉల్లంఘింస్తున్నారని పిటిషనర్ రీపక్ కన్సాల్ ఆరోపించారు. అయితే, ఆయన వాదనలు డివిజనల్ బెంచ్ తోసిపుచ్చింది, క్రీడలలో జెండా లేదా జాతి పేరును ప్రాతినిధ్యం కోసం ఉపయోగించడం దుర్వినియోగం కాదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను డిస్కిస్ చేసింది. చివరగా మీరు మీ ఇంట్లో జాతీయ జెండాను ఎగురవేయాలనుకుంటే.. మీకు నిషేదాజ్ఞాలు ఉన్నాయా అని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించడం కొసమెరుపు.

Next Story