ఢిల్లీ సంచ‌ల‌నం... RCBకి తొలి ఓటమి

by velandi.Saikiran |

బెంగళూరుపై ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ ఇచ్చి కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలు మరింత పెంచుకుంది ఢిల్లీ.

ఢిల్లీ సంచ‌ల‌నం... RCBకి తొలి ఓటమి
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ఆర్సీబీ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. శనివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న బెంగళూరు దూకుడుకు బ్రేక్ పడింది. WPL 2026లో భాగంగా ఇవాళ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన బెంగళూరు, 20 ఓవర్లు ఆడి 109 పరుగులు సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో ఢిల్లీ ముందు తక్కువ టార్గెట్ పెట్టింది ఆర్సీబీ. అయితే ఈ లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఛేదించింది. దీంతో బెంగళూరుపై ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ ఇచ్చి కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలు మరింత పెంచుకుంది ఢిల్లీ.

పాయింట్ల పట్టికలో బెంగళూరుదే హవా

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026లో బెంగళూరు దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ ల‌లో వరుసగా 5 విక్టరీలు అందుకుంది ఆర్సీబీ. దీంతో ఇప్పటికే ప్లే ఆఫ్ కు దూసుకు వెళ్ళింది బెంగళూరు. ఆ తర్వాత ఢిల్లీ, గుజరాత్ జట్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అటు ముంబై నాలుగో స్థానంలో ఉండగా ఐదవ స్థానంలో యూపీ ఉంది. మిగిలిన నాలుగు జట్లల్లో అన్ని జ‌ట్ల‌కు ప్లే ఆఫ్స్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. మ‌రి ఏ జ‌ట్టు ముందుకు దూసుకెళుతుందో చూడాలి.

Next Story