IPL 2025: ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్ లు

by velandi.Saikiran |

ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సె

IPL 2025: ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్ లు
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో ( Mumbai Indians vs Lucknow) మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్... ముంబై వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. హోమ్ గ్రౌండ్ లో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్... ఇవాళ కూడా గెలుస్తుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ప్లే ఆఫ్ వెళ్లాలంటే కచ్చితంగా రెండు జట్లు గెలవాల్సిన పరిస్థితి ఉంది.

ఇక మరో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Royal Challengers Bangalore vs Delhi Capitals ) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ రెండు జట్లు కూడా పాయింట్స్ టేబుల్ లో దూసుకు వెళ్తున్నాయి. రెండవ స్థానంలో ఢిల్లీ ఉండగా మూడవ స్థానంలో బెంగళూరు ఉంది. ఇందులో గెలిచిన జట్టు నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళుతుంది. కాబట్టి రెండు కూడా... గెలిచేందుకే కసరత్తులు చేస్తున్నాయి. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు.

Next Story