- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025: టాస్ గెలిచిన ఢిల్లీ... బ్యాటింగ్ ఎవరిదంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. రాయల్ చాలెంజర్స్

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా.. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల ( Delhi Capitals ) మధ్య... 24వ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ( Chinnaswamy Stadium ) వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ లో కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంత గడ్డపై మొదట బ్యాటింగ్ చేయనుంది.
రాయల్ చాలెంజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గత రికార్డులు ఒకసారి పరిశీలిస్తే.. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 31 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19 మ్యాచుల్లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 11 మ్యాచ్ లలో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ రెండు జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ లో రిజల్ట్... రాలేదు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల వివరాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కేఎల్ రాహుల్(w), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(సి), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్






