- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025: బ్యాటింగ్ చేయనున్న ఢిల్లీ...చెన్నై భారీ ప్లాన్ !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. ఇవాళ మరో కీలక ఫైట్ జరగబోతోంది. ఇందులో భాగంగానే చెన్నై సూప

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025 ) భాగంగా.. ఇవాళ మరో కీలక ఫైట్ జరగబోతోంది. ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals )మధ్య 17 మ్యాచ్ జరుగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా... జరుగుతున్న ఈ మ్యాచ్ లో.. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇక ఇందులో టాస్ గెలిచిన... ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ మొదట బౌలింగ్ చేయనుంది.
రెండు జట్ల పాత రికార్డులు.. ఒకసారి పరిశీలిస్తే... చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇప్పటివరకు 30 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ స్పష్టమైన ఆదిపత్యాన్ని ప్రదర్శించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన 30 మ్యాచ్ లలో ఏకంగా 19 మ్యాచ్ లు విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. అంటే దాదాపు 70 శాతం విజయాలను నమోదు చేసుకుంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్.. మాత్రం కేవలం 11 మ్యాచ్ లలో విజయం సాధించడం జరిగింది. ఓవరాల్ గా.. ఢిల్లీ పైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మంచి రికార్డు ఉందని చెప్పవచ్చు. అందులోనూ ఇవాళ చెన్నై గడ్డపైన మ్యాచ్ జరుగుతుంది. కాబట్టి కచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉండే ఛాన్స్ లో ఉంటాయి.






