రింకూ సింగ్ రిలీజ్‌..కేకేఆర్ కు కొత్త కెప్టెన్ ?

by velandi.Saikiran |

2026 టోర్నమెంటులో కేఎల్ రాహుల్ ను ఢిల్లీ జట్టు నుంచి ట్రేడ్ ప్రక్రియ ద్వారా తీసుకొని కెప్టెన్ చేయాలన్నది కేకేఆర్ ప్లాన్.

రింకూ సింగ్ రిలీజ్‌..కేకేఆర్ కు కొత్త కెప్టెన్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో త్వ‌ర‌లోనే మినీ వేలం జరగనుంది. డిసెంబర్ 15వ తేదీన మినీ వేలం ముంబై వేదికగా జరగనుందట. అంటే నవంబర్ 15వ తేదీలోపు ట్రేడ్, వేలంలో వదిలేసే ప్లేయర్ల లిస్టును సిద్ధం చేయాలని 10 ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు వెళ్లాయి. దీంతో వేలంలోకి వదిలేసే ప్లేయ‌ర్ల లిస్ట్ ను సిద్ధం చేసుకుంటున్నాయి ఫ్రాంచైజీలు. అయితే ఇందులో భాగంగానే కేఎల్ రాహుల్ పైన కేకేఆర్ జట్టు కన్నేసింది.

అజింక్య రహానే కెప్టెన్సీలో గత సీజన్ లో కేకేఆర్ దారుణంగా విఫలమైంది. అయితే 2026 టోర్నమెంటులో కేఎల్ రాహుల్ ను ఢిల్లీ జట్టు నుంచి ట్రేడ్ ప్రక్రియ ద్వారా తీసుకొని కెప్టెన్ చేయాలన్నది కేకేఆర్ ప్లాన్. దీనికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుండట కేకేఆర్. కె.ఎల్ రాహుల్ ను ఇస్తాం కానీ, రింకూ సింగ్, రమణ్ దీప్‌ సింగ్ ఇద్దరినీ తమకు ఇవ్వాలని ఢిల్లీ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో కేకేఆర్ వాళ్ళిద్దరిని వదిలేసేందుకు సిద్ధంగా లేమ‌ని తేల్చిచెప్పింద‌ట‌. కానీ కె.ఎల్ రాహుల్ కు ఎక్కువ రేటు ఇచ్చేందుకు సిద్ధమవుతోందట. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Next Story