IPL 2025: మునాఫ్ పటేల్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా

by velandi.Saikiran |   (  Updated:2025-04-17 11:35:32  IST  )

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ నేపథ్యంలో... ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) బౌలింగ్ కోచ్ మున

IPL 2025: మునాఫ్ పటేల్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ నేపథ్యంలో... ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ ( Munaf Patel )కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అతనిపై భారీ ఫైన్ ( Fine ) విధించింది ఐపీఎల్ కౌన్సిల్ ( IPL Council). బుధవారం రోజున రాజస్థాన్ రాయల్స్ తో ( Rajasthan Royals ) జరిగిన మ్యాచ్ లో రూల్స్ బ్రేక్ చేసినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ కు 25 శాతం జరిమానా విధించారు.

ఐపీఎల్ ప్రవర్తనా నియమావాళిని ఉల్లంఘించినందుకు గాను... మునాఫ్ పటేల్ కు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది ఐపీఎల్ కౌన్సిల్. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇది ఇలా ఉండగా... టీమిండియా కు గుడ్ బై చెప్పిన మునాఫ్ పటేల్... కొన్ని రోజులు ఐపీఎల్ ఆడి... ఆ తర్వాత కొన్ని రోజులు తన సొంత గ్రామంలో గడిపారు. ఇక ఈ సంవత్సరం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ గా కొనసాగుతున్నారు.

కాగా బుధవారం రోజున ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య 32వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు 188 పరుగులు చేయడంతో... మ్యాచ్ డ్రా అయింది. దీంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఈ సూపర్ ఓవర్ లో అద్భుతంగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్... గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇందులో అద్భుతంగా రాణించిన స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది.

Next Story