- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐర్లాండ్ చేతిలో ఓటమి..సూర్యకు కెప్టెన్సీ ఇవ్వాలంటూ డిమాండ్లు !
ఐర్లాండ్ చేతిలో ఓటమి నేపథ్యంలో సూర్యకు కెప్టెన్సీ ఇవ్వాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచకప్ విజేత భారత్ ను ఓడించి టీ20 సిరీస్ కైవసం చేసుకుంది ఐర్లాండ్. వరుసగా రెండు మ్యాచ్ లలో గెలుపొందిన ఐర్లాండ్, 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో భారత జట్టు కంటే మెరుగ్గా రాణించింది. ఈ క్రమంలోనే సిరీస్ దక్కించుకొని ఇండియాకు షాక్ ఇచ్చింది ఐర్లాండ్. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. గంభీర్ తప్పుడు నిర్ణయాల వల్ల భారత్ ఓడిపోయిందని కొంత మంది అంటుంటే.. కెప్టెన్సీ కారణంగా మ్యాచ్ పోయిందని మరికొందరు చెబుతున్నారు. గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ కాంబినేషన్ అద్భుతంగా ఉండేదని గుర్తు చేస్తున్నారు. వెంటనే శ్రేయస్ అయ్యర్ పైన వేటు వేసి, సూర్య కు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సూర్య రిటైర్మెంట్ అయ్యేవరకు, టీ20 కెప్టెన్ గా ఉంటే భారత్ విజయాల పరంపర కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ కు సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు.






