- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సహచర క్రికెటర్‌పై దొంగతనం కేసు పెట్టిన భారత స్టార్ క్రికెటర్
టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆమె నాయకత్వంలో ఢిల్లీ క్రికెటర్ ఆరుషి గోయెల్ యూపీకి ప్రాతినిధ్యం వహించింది. దీంతో ఇద్దరూ ఒకే డ్రెస్సింగ్ రూంను పంచుకున్నారు. తాజాగా ఆరుషి గోయెల్‌పై దీప్తి శర్మ కేసు పెట్టింది. రూ. 25 లక్షలు మోసం చేసిందని దీప్తి సోదరుడు సుమిత్ శర్మ ఆగ్రాలోని సదార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీప్తికి చెందిన ఆగ్రా ఫ్లాట్‌లోకి అరుషి చొరబడి రూ. 2 లక్షల విదేశీ కరెన్సీతోపాటు బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను దొంగలించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ‘ఫిర్యాదులో కొన్ని నిజాలను కనుగొన్నాం. బీఎన్‌ఎస్ సెక్షన్లు 305(ఏ)(దొంగతనం),331(3)(ఇంటిని బద్దలుకొట్టడం), 316(2)(నేరపూరిత నమ్మక ద్రోహం), 352(శాంతికి భంగం కలిగించడం) కింద అరుషిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.’అని ఏసీబీ సుఖన్య శర్మ తెలిపారు. రెండేళ్లకాలంలో దీప్తి రూ. 25 లక్షలు కోల్పోయిందని, తిరిగి చెల్లించాలని అడగ్గా అరుషి నిరాకరించిందని దీప్తి సోదరుడు సుమిత్ తెలిపాడు. దీనిపై అరుషి ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం దీప్తి ఇంగ్లాండ్ టూరుకు సన్నద్ధమవుతుంది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో ఆమెకు చోటు దక్కిన విషయం తెలిసిందే.
- Tags
- Deepti Sharma






