మళ్లీ అదరగొట్టిన దీప్తి.. విర్టుస్ వరల్డ్ అథ్లెటిక్స్‌లో బంగారు పతకం కైవసం

by Harish |

అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి మళ్లీ సత్తాచాటింది.

మళ్లీ అదరగొట్టిన దీప్తి.. విర్టుస్ వరల్డ్ అథ్లెటిక్స్‌లో బంగారు పతకం కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : తెలంగాణకు చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి అదరగొడుతోంది. ఇటీవలే పారా వరల్డ్ అథ్లెటిక్స్‌లో రజత పతకం గెలిచిన ఆమె మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తాచాటింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతున్న విర్టుస్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. 400 మీటర్ల(టీ20 విభాగం) రేసులో దీప్తి 55.92 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. 8 మంది అథ్లెట్లు పాల్గొన్న ఫైనల్‌లో ఆమె వేగానికి మిగతా అథ్లెట్లు వెనుకబడిపోయారు. పోర్చుగల్‌కు చెందిన కరీనా పైమ్(58.86 సెకన్లు), ఆస్ట్రేలియా అథ్లెట్ తెలయ బ్లాక్‌స్మిత్(59.09 సెకన్లు) రజత, కాంస్య పతకాలు గెలిచారు. రెండేళ్లుగా దీప్తి అంతర్జాతీయ వేదికపై నిలకడగా రాణిస్తోంది. గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన ఆమె.. పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. 2023లో జరిగిన ఆసియా గేమ్సులో కూడా బంగారు పతకం కైవసం చేసుకుంది.


Next Story