CSK స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం

by Muthe.Rajitha |

సీఎస్కే(CSK) టీంలోని స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

CSK స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎస్కే(CSK) టీంలోని స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చెన్నై జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే(Devon Conway) తండ్రి డెంటన్ కాన్వే(Denton Conway) మరణించారు. ఏప్రిల్ 20న డెంటన్ కాన్వే మరణించినట్టు CSK జట్టు అధికారికంగా ధృవీకరించింది. డెవాన్ కాన్వే తన తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోగా.. జట్టు అతనికి మద్దతుగా నిలిచింది. CSK ఆటగాళ్ళు ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో డెంటన్ కాన్వేకు నివాళిగా బ్లాక్ ఆర్మ్‌ బ్యాండ్‌లు ధరించి, సంతాపం తెలిపారు. కాగా డెంటన్ కాన్వే దక్షిణాఫ్రికాలో రగ్బీ, క్రికెట్ కోచ్‌గా పనిచేశారు. డెవాన్ క్రీడా జీవితంలో కీలక పాత్ర పోషించారు. డెవాన్ తన కెరీర్‌లో అనేక విజయాలను తన తండ్రి ప్రోత్సాహంతో సాధించారని టీం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కష్ట సమయంలో జట్టు సభ్యులు, అభిమానులు కాన్వే కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

Next Story