టీమిండియా హెడ్ కోచ్ పదవిపై మనసులో మాట బయటపెట్టిన డివిలియర్స్

by Satheesh |
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై మనసులో మాట బయటపెట్టిన డివిలియర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగియనుంది. దీంతో నెక్ట్స్ కోచ్ కోసం బీసీసీఐ గత నెల నుండే కసరత్తు స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే ఆశావహుల నుండి అప్లికేషన్లు సైతం స్వీకరిస్తోంది. రాహుల్ ద్రావిడ్ పదవి కాలం గతంలోనే ముగిసినప్పటికీ మరోసారి పొడిగించారు. అయితే, ఈ సారి రాహుల్ ద్రావిడ్ స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ పదవిపై సౌతాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓ ఇంటర్వ్యూలో ఏబీడీ మాట్లాడుతుండగా.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని భర్తీ చేస్తారా అన్న ప్రశ్నకు మనసులో మాట బయటపెట్టాడు డివిలియర్స్. తనకు కోచింగ్ అంటే ఇష్టమేనని.. కానీ ఇప్పుడే ఆ పదవి చేపట్టలేనని కుండబద్దలు కొట్టాడు. తాను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని, అందుకే ఇప్పటి వరకు కోచ్ పదవి గురించి ఆలోచించ లేదని క్లారిటీ ఇచ్చాడు. కానీ కోచింగ్‌ను తాను ఎంజాయ్ చేస్తానని.. ఫ్యూచర్‌లో కోచ్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉందని అన్నాడు. కొన్ని జట్లు, కొందరు ప్లేయర్స్‌తో కలిసి పని చేసేందుకు తాను ఎప్పుడూ ఇష్టపడుతానన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి అంటే చాలా ఒత్తిడితో కూడికుని ఉంటుందని.. ఆ జట్టుపై భారీ అంచనాలు ఉంటాయన్నారు.

Next Story

Most Viewed