గాయాలు ఆ జట్టును ఏం చేయలేవు.. చాంపియన్స్ ట్రోఫీ గెలిచేది ఆ జట్టే : డేవిడ్ వార్నర్

by Harish |

చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు వరుస షాక్‌లు తగిలాయి.

గాయాలు ఆ జట్టును ఏం చేయలేవు.. చాంపియన్స్ ట్రోఫీ గెలిచేది ఆ జట్టే : డేవిడ్ వార్నర్
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు వరుస షాక్‌లు తగిలాయి. స్టోయినిస్ అనూహ్యంగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. కెప్టెన్ కమిన్స్, మిచెల్ మార్ష్, హేజల్‌వుడ్ గాయాల కారణంగా ఐసీసీ టోర్నీకి దూరమయ్యారు. నలుగురు స్టార్ క్రికెటర్లు దూరం కావడం మెగా ఈవెంట్‌లో ఆసిస్‌ ప్రదర్శనపై ప్రభావం చూపనుంది. అయితే, కీలక ప్లేయర్లు దూరమైనప్పటికీ ఆస్ట్రేలియానే చాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందని మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ధీమా వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వార్నర్ మాట్లాడుతూ.. ఐసీసీ టోర్నీల్లో ఆసిస్ అద్భుతంగా ఆడుతుందని చెప్పాడు. ఎవరు ఆడుతున్నారనేది ముఖ్యం కాదని, వాళ్లకు ఎలా విజయం సాధించాలో తెలుసనని తెలిపాడు. అందువల్ల గాయపడిన ఆటగాళ్ల స్థానాల్లో ఎవరొచ్చినా సత్తాచాటుతారని చెప్పాడు. కాగా, చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో ఈ నెల 22న ఇంగ్లాండ్‌తో తలపడనుంది. రికీ పాంటింగ్ నాయకత్వంలో ఆసిస్ వరుసగా రెండుసార్లు(2006, 2009) చాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్‌ను సాధించింది.


Next Story