David Miller: ఐసీసీపై డేవిడ్ మిల్లర్ ఫైర్.. అసలు విషయం ఇదే!

by Kema Shiva Kumar |

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో భాగంగా బుధవారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌‌లో సౌతాఫ్రికా (South Africa)పై న్యూజిలాండ్ (New Zealand) 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.

David Miller: ఐసీసీపై డేవిడ్ మిల్లర్ ఫైర్.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో భాగంగా బుధవారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌‌లో సౌతాఫ్రికా (South Africa)పై న్యూజిలాండ్ (New Zealand) 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో కివీస్ జట్టు ఈనెల 9న ఫైనల్‌లో తలపడబోతోంది. ఈ క్రమంలోనే సెమీ ఫైనల్‌లో సెంచరీ చేసిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ (David Miller) ఐసీసీ (ICC)పై విమర్శలు గుప్పించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ అంతా గందగోళంగా ఉందని.. ఆ కారణంగా తాము సెమీస్ ఫైనల్‌‌ మ్యాచ్‌కు ముందు సమయం దొరకలేదని అన్నారు. గంట నలభై నిమిషాల పాటు ఫ్లైట్ జర్నీ (Flight Journey) చేశామని తెలిపాడు. ఈ నెల 1న కరాచీ (Karachi)లో ఇంగ్లాండ్ (England) టీమ్‌తో మ్యాచ్ ముగియగానే తెల్లవారుజామున దుబాయ్‌ (Dubai)లో మ్యాచ్ కోసం సాయంత్రం 4 గంటలకు వచ్చామని అన్నారు. భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) మధ్య మ్యాచ్ కంప్లీట్ అవ్వగానే మరునాడు ఉదయం 7.30 గంటలకు తిరిగి పాకిస్థాన్‌ (Pakistan)కు బయలుదేరామని తెలిపాడు. మొత్తం 5 గంటలు పాటు జర్నీ చేస్తే తమ ప్రాక్టీస్‌కు సమమం ఎక్కడుందని మిల్లర్ ప్రశ్నించాడు.

కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్‌లోని ఆఖరి లీగ్ మ్యాచ్‌ వరకు సెమీస్‌లో ఏ జట్టు ఎవరితో తలపడబోతోందనే విషయంలో క్లారిటీ రాలేదు. టీమిండియా సెమీస్‌కు వెళితే ఆ మ్యాచ్ దుబాయ్‌లోనే నిర్వహిస్తామని ఐసీసీ (ICC) ఇప్పటికే షెడ్యూల్‌‌లో ప్రకటించింది. అందుకే గ్రూప్-B లోని నాకౌట్‌ జట్లు ఆస్ట్రేలియా (Australia), సౌతాఫ్రికా (South Africa) జట్లు రెండు కలిసి దుబాయ్‌కు వెళ్లాయి. కానీ, ఆఖరి గ్రూప్ స్టేజ్‌ ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి పాయింట్స్ టెబుల్‌లో టాప్‌లో నిలిచింది. ఈ క్రమంలో ఫస్ట్ సెమీస్ ఫైనల్ కోసం ఆసిస్ జట్టు దుబాయ్‌ (Dubai)లోనే ఉండిపోగా.. సౌతాఫ్రికా సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం తిరిగి పాకిస్థాన్‌కు తప్పక వెళ్లాల్సి వచ్చింది.

Next Story