Ranji Trophy 2025 : రంజీల్లో చెలరేగిపోయిన నూనూగు మీసాల కుర్రాడు

by Muthe.Rajitha |

రంజీ మ్యాచులు(Ranji Trophy 2025) అంటే సీనియర్ క్రికెటర్స్ పరుగుల వరద పారిస్తారు.

Ranji Trophy 2025 : రంజీల్లో చెలరేగిపోయిన నూనూగు మీసాల కుర్రాడు
X

దిశ, వెబ్ డెస్క్ : రంజీ మ్యాచులు(Ranji Trophy 2025) అంటే సీనియర్ క్రికెటర్స్ పరుగుల వరద పారిస్తారు. కానీ ఏ మాత్రం అనుభవంలేని ఓ 21 ఏళ్ళ కుర్రాడు మాత్రం ఏకంగా రంజీ ఫైనల్(Ranji Final) లో సెంచరీ కొట్టాడు. డానిష్ మాలేవర్(Danish Malewar) అనే కుర్రాడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పెద్దగా అనుభవం లేకపోయినా అది తనకు అడ్డుకాదని నిరూపిస్తూ సెంచరీతో పరుగుల వరద పారించారు. కేరళతో బుధవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ-కేరళ(Vidarbha vs Kerala) తొలి రోజు ఆటలో భాగంగా తన సెంచరీతో విదర్భ జట్టును ఆదుకున్నాడు. ఒత్తిడిని తట్టుకుంటూ మాలేవర్ చేసిన సెంచరీపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మొదట బ్యాటింగ్ కు దిగిన విదర్భ 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన మాలేవర్, సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్(Karun Nayar) తో కలిసి 215 పరుగుల భారీ స్కోర్ చేశాడు. కాగా జట్టు భారీ స్కోర్ చేయడం ఖాయమన్న దశలో దురదృష్టవశాత్తు కరుణ్ నాయర్ 86 పరుగుల వద్ద రనౌటయ్యాడు. ప్రస్తుతం విదర్భ తొలి రోజు 85 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. క్రీజ్ లో డానిష్ మాలేవర్ (138), యష్ ఠాకూర్ (2) ఉన్నారు. కేరళ బౌలర్లలో నిదీష్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈడెన్ ఆపిల్ టామ్ కు ఒక వికెట్ లభించింది. రేపటి మ్యాచ్ లో ఏం జరగనుందో మరి వేచి చూడాలి.

Next Story