CSKలోకి రోహిత్, రషీద్ తో పాటు మరో ఇద్దరు డేంజర్ ప్లేయర్లు?

by velandi.Saikiran |

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బేబీ ఏబీ ( ABD) దొరికాడని కామెంట్ చేస్తున్నారు. ఇక ఆయుష్ మాత్రేను రోహిత్ శర్మతో

CSKలోకి రోహిత్, రషీద్ తో పాటు మరో ఇద్దరు డేంజర్ ప్లేయర్లు?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 ( IPL 2026) టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( CSK ) చాలా బలంగా తయారవుతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ జట్టులోకి యంగ్ స్టార్లు రావడంతో.... చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వచ్చే సంవత్సరం టోర్నమెంట్లో అద్భుతంగా రాణిస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా డేవాల్డ్ బ్రేవిస్ ( Dewald Brevis ) దక్షిణాఫ్రికా తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు. మొన్న సెంచరీ కూడా చేసి ర్యాంకింగ్స్ లో దూసుకు వచ్చాడు.

దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బేబీ ఏబీ ( ABD) దొరికాడని కామెంట్ చేస్తున్నారు. ఇక ఆయుష్ మాత్రేను రోహిత్ శర్మతో పోల్చుతున్నారు. నూర్ అహ్మద్ ను రషీద్ ఖాన్ తో పోల్చుతున్నారు. అలాగే మతిషా పతిరణను మలింగతో పోల్చుతున్నారు. దానికి తగ్గట్టుగానే వీళ్ళందరూ.. మాజీ క్రికెటర్ల దేశాలకు సంబంధించిన వారు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ వచ్చే సీజన్లో రానిస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోసారి ఛాంపియన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. క్లిక్

Next Story