విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ పై డేల్ స్టెయిన్ హాట్ కామెంట్స్

by velandi.Saikiran |

లార్డ్స్, సర్రే లో ప్రాక్టీస్ కు విరాట్ కోహ్లీ వెళ్తాడని సంచలన నిజాలు బయటపెట్టారు. అతనికి స్పెషల్ గా ట్రైనర్ కూడా ఉన్నాడ

విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ పై డేల్ స్టెయిన్ హాట్ కామెంట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భార‌త జట్టు రన్ మెషీన్‌ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ ( Dale Steyn) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిట్ గా ఉండేందుకు విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తారని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ వెల్లడించారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్న లండన్ లో విరాట్ కోహ్లీ తరచూ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని స్పష్టం చేశారు డేల్ స్టెయిన్.

లార్డ్స్, సర్రే లో ప్రాక్టీస్ కు విరాట్ కోహ్లీ వెళ్తాడని సంచలన నిజాలు బయటపెట్టారు. అతనికి స్పెషల్ గా ట్రైనర్ కూడా ఉన్నాడని వెల్లడించారు. విరాట్ కోహ్లీ మానసికంగా సూపర్ స్ట్రాంగ్ అని ప్రశంసించారు డేల్ స్టెయిన్. అతడు నిజమైన ప్రొఫెషనల్ ఆటగాడని వెల్లడించారు. ఇలాంటి ప్లేయర్ టీమిండియాలో ఉండడం అదృష్టం అన్నారు. ఫిట్ గా ఉన్న నేపథ్యంలోనే మొన్న దక్షిణాఫ్రికా పై సెంచరీ నమోదు చేసినట్లు గుర్తు చేశారు. ఇది ఇలా ఉండగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా మధ్య మొన్న జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా పై భారత జ‌ట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Next Story