- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SRH కొంప ముంచిన క్లాసెన్...ముంబై బతికి బయటపడింది !
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad ) కాటేరమ్మ కొడుకుగా పిలుచుకునే హేన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen)

దిశ, వెబ్ డెస్క్ : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad ) కాటేరమ్మ కొడుకుగా పిలుచుకునే హేన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen) కొంపముంచాడు. భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్న... ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ( Ryan Rickelton ) ను పెవిలియన్ కు పంపే అవకాశాన్ని చేజేతులా చేజార్చాడు క్లాసెన్. హైదరాబాద్ బౌలర్ జీషన్ వేసిన బంతిని... బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు ర్యాన్ రికెల్టన్. ఈ నేపథ్యంలోనే... ఫ్రంట్ లో ఉన్న హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins ).... రికెల్టన్ కొట్టిన బతిని అద్భుతంగా అందుకున్నాడు.
దీంతో ముంబై ప్లేయర్ ర్యాన్ రికెల్టన్.. అవుట్ అయ్యాడని.. హైదరాబాద్ ఫ్యాన్స్ అలాగే ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. కానీ అంతలోనే నో-బాల్ ( No Ball ) అంటూ అంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి కారణం కాటేరమ్మ కొడుకు క్లాసెన్. వికెట్ల వెనుక ఉన్న కాటేరమ్మ కొడుకు క్లాసెన్.... తన గ్లౌజులను వికెట్ల కంటే ముందు పెట్టాడు. రూల్స్ ప్రకారం... అలా పెడితే నో బాల్ గా ప్రకటిస్తారు. ఇక్కడ అదే జరిగింది. ర్యాన్ రికెల్టన్ ను నాట్ ఔట్ గా ప్రకటించారు.
ఈ తరుణంలో హైదరాబాద్ ఫ్యాన్స్... తీవ్ర నిరాశకు లోనయ్యారు. క్లాసెన్ మామ ఎందుకు అలా చేసావ్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే.. ఇలాంటి నేపథ్యంలోనే రెండు బౌండరీలు కొట్టిన తర్వాత ముంబై ఆటగాడు ర్యాన్ రికెల్టన్ ఔట్ అయ్యాడు. 23 బంతుల్లో 31 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్ ... హర్షల్ పటేల్ బౌలింగ్ లో హెడ్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దింతో ఊపిరి పీల్చుకున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad ) ఫాన్స్.
RICKELTON NOT-OUT...!!!!
— Johns. (@CricCrazyJohns) April 17, 2025
- Cummins took a brilliant catch but Klassen's hand was just infront of the stumps.
Great spot by the third umpire 👌 pic.twitter.com/yBWXbmmrJp






