SRH : లక్నోను మాస్ ర్యాగింగ్ చేసిన కమిన్స్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-25 16:23:26  IST  )

సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్(IPL Match) లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) పై హైదరాబాద్ సన్ రైజర్స్(SRH) విజయం సాధించగా.. లక్నో ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి.

SRH : లక్నోను మాస్ ర్యాగింగ్ చేసిన కమిన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్(IPL Match) లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) పై హైదరాబాద్ సన్ రైజర్స్(SRH) విజయం సాధించగా.. లక్నో ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. ఒకరకంగా LSG ప్లే ఆఫ్ ఆశలపై SRH నీళ్ళు చల్లినట్టైంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. లక్నో జట్టును హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) ఒక ఆట ఆడుకున్నాడు. లక్నోలో మ్యాచ్ అయిన అనంతరం ఆరెంజ్ టీం ఆటగాళ్లు లక్నోను వీడుతూ.. LSG బ్యాటర్ మార్ష్(Marsh) కటౌట్ తో బస్ ఎక్కాడు కమిన్స్.

కప్ కొట్టకుండా ఇంటికే అనే అర్థం వచ్చేలా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోను షేర్ చేసిన SRH టీం ఈ వీడియోలో మార్ష్ కి ఎలాంటి హాని జరగలేదు అని రాసి.. లాఫింగ్ ఎమోజీని ఇచ్చింది. అంటూ రాసుకొచ్చింది. క్రికెట్ ప్రేమికులు, సన్ రైజర్స్ అభిమానులు ఈ వీడియోపై స్పందిస్తూ.. ఇదెక్కడి మాస్ ర్యాగింగ్ రా మావా అంటున్నారు.

Click For Tweet..

Next Story