- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Champions Trophy : ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. బాంబు పేల్చిన హెడ్ కోచ్
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి.

దిశ, స్పోర్ట్స్ : త్వరలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. మరో ఇద్దరు స్టార్లు కూడా మెగా ఈవెంట్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆసిస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ షాకింగ్ న్యూస్ వెల్లడించాడు. అందులో కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ఉండటం ఆసిస్‌ను ఆందోళనపరిచే విషయం. పేసర్ జోష్ హేజల్‌వుడ్ కూడా ఐసీసీ టోర్నీకి దూరమయ్యే అవకాశం ఉంది. కమిన్స్ కాలి మడమ గాయంతో బాధపడుతున్నాడు.
అలాగే, హేజల్‌వుడ్ భారత్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన విషయం తెలిసిందే. వీరిద్దరూ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీకి నాటికి వీరు ఫిట్‌నెస్ సాధించే అవకాశం లేదని సమాచారం. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా హెడ్ కోచ్ మెక్‌డొనాల్డ్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ‘కమిన్స్ ఇప్పటికీ ఇంకా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. కాబట్టి, అతను ఆడటం అసంభవం. మరోవైపు, హేజల్‌వుడ్ ఫిట్‌నెస్ సాధించడానికి పోరాడుతున్నాడు. మెడికల్ రిపోర్ట్ వచ్చాక స్పష్టత వస్తుంది.’ అని చెప్పాడు. కమిన్స్ దూరమైతే స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్‌లలో ఒకరు ఆసిస్‌కు నాయకత్వం వహిస్తారని వెల్లడించాడు.
శ్రీలంకతో రెండో టెస్టు ముగిసిన తర్వాత కెప్టెన్‌పై, కమిన్స్, హేజల్‌వుడ్ రిప్లేస్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, మిచెల్ మార్ష్ స్థానంలో బ్యూ వెబ్‌స్టర్ చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చేరతాడని మెక్‌డొనాల్డ్ తెలిపాడు. కెప్టెన్ కమిన్స్,పేసర్ హేజల్‌వుడ్, మిచెల్ మార్ష్ ఐసీసీ ఈవెంట్‌కు దూరమవడం ఆసిస్ విజయవకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపనుంది. ఆసిస్ జట్టులోని మరికొందరు ప్లేయర్లు కూడా గాయాలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.






