- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొప్ప మనసు చాటుకున్న శివమ్ దూబే.. ఏం చేశాడంటే?
టీమ్ ఇండియా, చెన్నయ్ సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే గొప్ప మనసు చాటుకున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా, చెన్నయ్ సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే గొప్ప మనసు చాటుకున్నాడు. యువ అథ్లెట్లను ప్రోత్సహించడానికి ముందుకొచ్చాడు. తమిళనాడుకు చెందిన 10 మంది యువ అథ్లెట్లకు ఒక్కొక్కరికి రూ. 70 వేలు అందజేస్తానని ప్రకటించాడు. మంగళవారం చెన్నయ్‌లో తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్(టీఎన్‌ఎస్‌జేఏ) వార్షిక అవార్డులు, స్కాలర్‌షిప్ కార్యక్రమం జరిగింది. పీబీ అభినంద్(టేబుల్ టెన్నిస్), కెఎస్ వెనిసా శ్రీ(ఆర్చరీ), ముత్తుమీనా వెల్లసామి(పారా అథ్లెటిక్స్), షామీనా రియాజ్(స్క్వాష్), జయంత్(క్రికెట్), ఎస్.నందన(క్రికెట్), పి.కమలి(సర్ఫింగ్), ఆర్. అభినయ(అథ్లెటిక్స్), జితిన్ అర్జున్(అథ్లెటిక్స్), తక్షంత్(చెస్) అవార్డులు గెలుచుకున్నారు. వీరికి టీఎన్‌ఎస్‌జేఏ రూ.30 వేలు అందజేసింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన దూబే ఆ 10 మంది యువ అథ్లెట్లకు అదనంగా తన వంతు ఆర్థిక సాయం ప్రకటించాడు. ఒక్కొక్కరికి రూ.70 ఇస్తానని తెలిపాడు. ఈ సందర్భంగా దూబే మాట్లాడుతూ..‘ఈ కార్యక్రమం యువ అథ్లెట్లను ప్రోత్సహకరంగా ఉంటుంది. ఈ చిన్న విజయాలే మరింత కష్టపడానికి, దేశాన్ని గర్వపడేలా చేయడానికి ప్రేరణగా నిలుస్తాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. రూ.30 వేలు చిన్న అమౌంట్‌గా ఉండొచ్చు. కానీ, ప్రోత్సాహకరంగా ఉంటుంది.’ అని దూబే చెప్పుకొచ్చాడు.
- Tags
- Shivam Dube






