IPL 2025 లో అట్టర్ ఫ్లాప్ అయిన CSK కు అరుదైన రివార్డ్

by velandi.Saikiran |   (  Updated:2025-06-04 11:35:38  IST  )

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) టోర్నమెంట్ ముగిసింది. మంగళవారం రోజున జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్

IPL 2025 లో అట్టర్ ఫ్లాప్ అయిన  CSK కు అరుదైన రివార్డ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) టోర్నమెంట్ ముగిసింది. మంగళవారం రోజున జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB) విజయం సాధించడంతో.. 18 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టుకు సంబంధించిన అభిమానులు ( RCB Fans) సంబరాలు చేసుకుంటున్నారు.

నిన్న అర్ధరాత్రి నుంచి ఈ సంబరాలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఛాంపియన్ గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB ) నిలువగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Chennai Super Kings team ) కూడా అరుదైన రికార్డు సంపాదించింది. ఐపీఎల్ క్రీడా స్ఫూర్తికి కట్టుబడి ఉండే ఉత్తమ జట్టుకు ఫెయిర్ ప్లే అవార్డు ( Fair Play Award) ఇస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ఈ అవార్డు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దక్కింది.

దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అత్యధిక సార్లు ఫెయిర్ ప్లే అవార్డు గెలిచిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏడు సార్లు ఫెయిర్ ప్లే అవార్డు దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్. అటు ముంబై తో సమానంగా టైటిల్స్ ను కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అత్యధిక ప్లే ఆఫ్స్ , ఫైనల్స్ ఆడిన రికార్డు కూడా చెన్నై సూపర్ కింగ్స్ పేరు పైనే ఉంది.

Next Story