ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడం ఖాయం : సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Dishanational3 |
ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడం ఖాయం : సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 17వ సీజన్‌‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన అతను సీఎస్కేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గత సీజన్‌లో చెన్నయ్ బౌలింగ్‌లో లోపాలు కనిపించాయి. వేలంలో తమ బలహీనతలను ఆ జట్టు అధిగమించింది. వారు కొనుగోలు చేసిన ఆటగాళ్లను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంబటి రాయుడు రిటైర్మెంట్ తర్వాత సీఎస్కే మిడిలార్డర్‌ను కూడా బలోపేతం చేసుకుంది. కుర్రాళ్లు, అనువజ్ఞులతో ఆ జట్టు బాగుంది. కాబట్టి, సీఎస్కే కచ్చితంగా టాప్-4లో ఉంటుంది. చెన్నయ్ జట్టు 16 సీజన్లలో 12 సార్లు ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యింది. 13వ సీజన్‌లోనే అదే జరుగుతుంది.’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా, మార్చి 23 నుంచి లీగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లీగ్ సమయంలోనే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో బీసీసీఐ షెడ్యూల్‌పై మల్లాగుల్లాలు పడుతున్నది.

Next Story

Most Viewed