CSK vs SRH : టాస్ గెలిచిన హైదరాబాద్

by M.Rajitha |
CSK vs SRH : టాస్ గెలిచిన హైదరాబాద్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు చెన్నై, హైదరాబాద్(CSK vs SRH) జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం చెపాక్ స్టేడియం(Chidambaram Stadium) వేదికగా మరికొద్దిసేపట్లో మ్యాచ్ మొదలవనుంది. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కు దిగనుంది. ఇక భారీ అంచనాలతో ఈ సీజన్లోకి అడుగుపెట్టిన ఈ రెండు జట్లు ఘోర వైఫ్యల్యాలను మూట గట్టుకున్నాయి. పాయింట్ల టేబుల్ లో CSK అట్టడుగు స్థానంలో ఉండగా.. SRH 9వ స్థానంలో ఉంది. దాదాపు ఈ రెండు జట్ల ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు అయ్యాయని చెప్పుకోవచ్చు.



Next Story