CSK vs KKR : 103 పరుగులకే కుప్పకూలిన చెన్నై

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో సీఎస్కే జట్టు ఈరోజు పరమ చెత్త బ్యాటింగ్ చేసింది.

CSK vs KKR : 103 పరుగులకే కుప్పకూలిన చెన్నై
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో సీఎస్కే జట్టు ఈరోజు పరమ చెత్త బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ ధోనితో సహ బ్యాటర్లు అందరూ దారుణంగా విఫలం అయ్యారు. చెన్నైలోని చిదంబరం స్టేడియం(Chidambaram Stadium) వేదికగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(CSK vs KKR) మధ్య జరిగిన మ్యాచ్ లో సీఎస్కే 103 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నైకి కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి చెన్నై బ్యాటర్స్ కు చుక్కలు చూపించారు. దీంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేసింది. కేకేఆర్ బౌలర్స్ లో సునీల్ నరైన్ , వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా తలా రెండు వికెట్లు తీశారు. 104 పరుగుల లక్ష్యంతో కోల్‌కతా తదుపరి బరిలోకి దిగనుంది.

Next Story