IPL 2025: CSKలోకి రాక్షసుడు వస్తున్నాడు !

by velandi.Saikiran |   (  Updated:2025-04-18 11:09:37  IST  )

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 ) నేపథ్యంలో.. చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టులోకి

IPL 2025: CSKలోకి రాక్షసుడు వస్తున్నాడు !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 ) నేపథ్యంలో.. చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టులోకి భయంకరమైన ఆటగాడు రాబోతున్నాడు. సౌత్ ఆఫ్రికా ( South Africa) యంగ్ క్రికెటర్ బేబీ ఏబిగా పేరుగాంచిన డెవాల్డ్ బ్రెవిస్ ( DEWALD BREVIS )... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ( CSK) చేరిపోయాడు. ఈ మేరకు.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన కూడా విడుదల చేసింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. అటు డేంజర్ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ కూడా... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్తున్నట్లు... ఎల్లో కలర్ పోస్ట్ పెట్టి రివిల్ చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో గుర్జప్నీత్ సింగ్ ( Gurjapneet Singh ) గాయపడిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్ ( DEWALD BREVIS ) ను తీసుకుంటున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటన చేసింది. దీంతో హిట్టర్లు లేక సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు... డెవాల్డ్ బ్రెవిస్ రూపంలో... 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది.

అటు డెవాల్డ్ బ్రెవిస్ జట్టులోకి రావడంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు కూడా సంబరపడిపోతున్నారు. ఇది ఇలా ఉండగా... మొన్నటి వరకు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ గా... డెవాల్డ్ బ్రెవిస్ కొనసాగాడు. అయితే మొన్నటి ఐపీఎల్ మెగా వేలంలో... డెవాల్డ్ బ్రెవిస్ Un సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. ఇక ఇప్పుడు బేబీ ఏబిగా పేరుగాంచిన డెవాల్డ్ బ్రెవిస్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది.

Next Story