- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత క్రికెట్ బాగుండాలంటే అతను మరో 10 ఏళ్లు ఆడాలి : ఖలీల్ అహ్మద్
భారత క్రికెట్ బాగుండాలంటే రోహిత్ శర్మ మరో 10 ఏళ్లు ఆడాలని టీమిండియా బౌలర్ ఖలీల్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెట్ బాగుండాలంటే రోహిత్ శర్మ మరో 10 ఏళ్లు ఆడాలని టీమిండియా బౌలర్ ఖలీల్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖలీల్.. రోహిత్ గురించి మాట్లాడాడు. ‘రోహిత్ మరో 10 ఏళ్లు ఆడాలి. భారత క్రికెట్ బాగుంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.’ చెప్పాడు. అలాగే, రోహిత్ తనలో ఏ విధంగా ఆత్మవిశ్వాసం నింపాడో వివరించాడు. ‘2019లో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో ఆడుతున్నప్పుడు నేను గొప్పగా రాణించలేదు. ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. స్టేడియం నుంచి వెళ్తున్నప్పుడు అందరూ రోహిత్ భాయ్ అంటూ అరిచారు. డ్రెస్సింగ్ రూంలో రోహిత్ నా వద్దకు వచ్చి మాట్లాడాడు. ‘నీ శక్తి ఏంటో నీకు తెలియదు. అభిమానుల కేరింతలు మీకు కూడా దక్కాలి. పాజిటివ్‌గా ఉండు’అని చెప్పాడు. కెప్టెన్ అంటే అతనిలా ఉండాలి. మ్యాచ్ తర్వాత అతని మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నాతోనే కాదు రిషబ్‌తో కూడా ఇలాగే మాట్లాడటాన్ని నేను చూశాను. వాటే ఏ మ్యాన్.. వాటే ఏ కెప్టెన్ అనుకున్నా. ఇటీవల ఎన్‌సీఏలో అతన్ని కలిశాను. చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఇలాగే ఫిట్‌గా ఉంటూ ఆడటం కొనసాగించాలని కోరా. నా జీవితంలో రోహిత్ లాంటి కెప్టెన్‌ను చూడలేదు. అతనిపై నాకు చాలా గౌరవం, అభిమానం.’అని ఖలీల్ చెప్పుకొచ్చాడు.






