- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంజూతో జడ్డూ ట్రేడ్.. ముగ్గురూ ఓకే? దానికోసమే వెయిటింగ్!
సంజూతో జడ్డూను ట్రేడ్ చేసుకోవడానికి చెన్నయ్ సూపర్ కింగ్స్ సిద్ధమైంది. జడ్డూతోపాటు కర్రాన్‌ను కూడా ఇచ్చేస్తోంది.

దిశ, స్పోర్ట్స్: వచ్చే ఐపీఎల్ సీజన్‌లో అతిపెద్ద డీల్ దాదాపు పూర్తయినట్లే కనిపిస్తోంది. రిటెన్షన్ లిస్టును ప్రకటించడానికి కేవలం నాలుగు రోజులే గడువున్న నేపథ్యంలో.. ప్లేయర్ల ట్రేడ్ డీల్స్ వేగవంతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ ప్రీమియర్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను ట్రేడ్ చేసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైంది. అతని కోసం చెన్నయ్ సూపర్ కింగ్స్ భారీ ఆఫర్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. సంజూ కోసం ఏకంగా రవీంద్ర జడేజా, శామ్ కర్రాన్ ఇద్దర్నీ వదులుకునేందుకు సీఎస్కే రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు రెండు జట్లూ ఓకే చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. అయితే కర్రాన్ విదేశీ ప్లేయర్ కావడంతో అతను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి ఎన్‌ఓసీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దానికోసం ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని, అది వచ్చేస్తే రెండు ఫ్రాంచైజీలూ బీసీసీఐకి ఈ డీల్ విషయంలో అప్‌డేట్ ఇస్తాయని సమాచారం. ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లూ ఈ ట్రేడ్ డీల్‌కు ఒప్పుకున్నట్లు ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.
సీఎస్కే ప్లాన్ ఇదే..
ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడిన 14 మ్యాచుల్లో చెన్నయ్ కేవలం 4 మ్యాచులే విజయం సాధించింది. సరైన జట్టు కూర్పు కుదరకపోవడంతో ఈ టీం చాలా ఇబ్బందులు పడింది. దానికితోడు మహేంద్ర సింగ్ ధోనీ కూడా వచ్చే ఏడాది ఆడతాడో? లేదో? అనే అనుమానాలున్నాయి. ఒకవేళ ఆడినా ధోనీ కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే ఆడే అవకాశాలున్నాయి. అలాంటప్పుడు మైదానంలో వికెట్ కీపింగ్ చేయడంతోపాటు జట్టును ముందుండి నడిపించే ప్లేయర్ కోసం చెన్నయ్ చూస్తోంది. అందుకే సంజూ కోసం చూస్తోంది. అతనితోపాటు జడ్డూ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో దీనికోసం చర్చలు జరుపుతున్నట్లు సీఎస్కే వర్గాలు చెప్తున్నాయి.






