ధోని నా మజాకా... సూపర్ రికార్డు సృష్టించిన CSK

by Disha Web Desk 9 |
ధోని నా మజాకా... సూపర్ రికార్డు సృష్టించిన CSK
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఎంఎస్ ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై జుట్టుకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రేజీ వల్లే చెన్నై జట్టు ఈ సారి ఆడిన అన్ని మ్యాచుల్లో మ్యాచ్ వ్యూస్ దక్కించుకుంది. అలాగే ఐపీఎల్ 2023 చాంపియన్ గా కూడా నిలిచింది. ఇదే కాకుండా చెన్నై జట్టు మరో అరుదైన రికార్డును సాధించింది. మే నెలలో వరల్డ్ మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ టీమ్స్ జాబితాలో CSK చోటు దక్కించుకుంది. fb లో వచ్చిన మద్దతు ఆదరంగా.. చెన్నై ప్రపంచంలోనే రెండో మోస్ట్ పాపులర్ జట్టుగా నిలిచింది. కాగా ఈ జాబితాను deporter,finanzas అనే సంస్థలు వివరాలు సేకరించి.. వెల్లడించింది. కాగా ఈ జాబితా ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక క్రేజ్ ఉన్న జట్టుగా ఫుట్ బాల్ టీమ్ రియల్ మాడ్రిడ్ (31.6M)గా ఉంది. అలాగే చెన్నై(30.3M) రెండో స్థానం, మాంచెస్టర్ సిటీ(27.9M)తో మూడో స్థానంలో, బార్సిలోనా ( 24.2M) నాలుగో స్థానంలో, అలాగే లివర్ పూల్(14.9M)తో ఐదో స్థానంలో ఉన్నాయి.Next Story