- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదంలో చెన్నై సూపర్ కింగ్స్..ఆ ఒక్క తప్పిదం
చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంపై సన్ టీవీ నెట్ వర్క్ నష్ట పరిహారం కోరుతూ దావా వేసింది.

దిశ, వెబ్ డెస్క్: SRH ఓనర్ కావ్య మారన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఐపీఎల్ ప్రారంభాని కంటే ముందే CSK వివాదంలో చిక్కుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంపై సన్ టీవీ నెట్ వర్క్ ( Sun TV Network ) నష్ట పరిహారం కోరుతూ దావా వేసింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టులో కోటి రూపాయల నష్ట పరిహారం కోరుతూ వివాదానికి తెరలేపింది సన్ టీవీ నెట్వర్క్. సన్ పిక్చర్స్ నిర్మించిన జైలర్, జైలర్ 2, కూలీ సినిమాలలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చెన్నై సూపర్ కింగ్స్ వాడుకోంది. ఐపీఎల్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఈ పాటలు, బీజీఎమ్ వాడుతుంది.
కోటి రూపాయలు చెల్లించాల్సిందే
అయితే తమ అనుమతి లేకుండా మ్యూజిక్, డైలాగ్స్, ఆడియో ట్రాక్స్ వాడుకున్నారని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంపై సన్ టీవీ సీరియస్ అయింది. ఇది కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొంది. అందుకే తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది సన్ టీవీ. అయితే దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ కూడా క్లారిటీ ఇచ్చింది. గతంలో వాడుకున్నప్పటికీ, వాటిని తొలగించినట్లు క్లారిటీ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో మరోసారి ఇరువు వర్గాల వాదన విని నిర్ణయం తీసుకుంటామని మద్రాస్ కోర్టు క్లారిటీ ఇచ్చింది.






