ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సీఎస్కే కోచ్ ఏం చెప్పాడంటే?

by Harish |

ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సీఎస్కే కోచ్ ఏం చెప్పాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : పిక్క గాయంతో బాధపడుతున్న చెన్నయ్ సూపర్ కింగ్స్ దిగ్గజ ప్లేయర్ ఎం.ఎస్ ధోనీ ఇంకా జట్టుకు అందుబాటులోకి రాలేదు. ఇప్పటికే 7 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఎప్పుడు వస్తాడనే దానిపై కూడా క్లారిటీ లేదు. గాయం నుంచి కోలుకుని వచ్చినా అతను ఇంపాక్ట్ ప్లేయర్‌గానే ఆడతాడనే చర్చ జరుగుతుంది. కానీ, ఆ ప్రచారాన్ని సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ కొట్టిపారేశాడు. ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. మాహీ ఇంపాక్ట్ ప్లేయర్ రోల్‌కే పరిమితం కాడన్నాడు. పూర్తి స్థాయిలో వికెట్ కీపింగ్ బాధ్యతలు చూస్తాడని తెలిపాడు.‘పిక్క గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోవాలి. లేదంటే ఇన్నింగ్స్ చివర్లో ఒకటి లేదా రెండు పరుగులు తీయడానికి అతను తీవ్రంగా ప్రయత్నిస్తే సమస్య తీవ్రంగా మారుతుంది. ఆ పని భారాన్ని తట్టుకునేంత తన పిక్క ఉందని ధోనీ నిర్ధారించుకోవాలి. అతను తిరిగి కీపింగ్ బాధ్యతలు చేపడతాడని నాకు నమ్మకముంది. నెట్స్‌లో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక మాహీ పిక్క గాయం నుంచి పూర్తిగా కోలుకోవడమే తరువాయి.’అని హస్సీ తెలిపాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు. ధోనీ తిరిగి వస్తే ఆ బాధ్యతలను అతనికి అప్పగించి కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడు.


Next Story