క్రొయేషియా క్రికెటర్ చరిత్ర.. 17 ఏళ్ల కెప్టెన్‌గా..

by Harish |

క్రొయేషియా ఆటగాడు జాక్ వుక్‌సిచ్ చరిత్ర సృష్టించాడు.

క్రొయేషియా క్రికెటర్ చరిత్ర.. 17 ఏళ్ల కెప్టెన్‌గా..
X

దిశ, స్పోర్ట్స్ : 17 ఏళ్ల వయసులో జాతీయ జట్టులో చోటు సంపాదించడమే చిన్న విషయం కాదు. అలాంటిది 17 ఏళ్లకే జాతీయ జట్టుకు కెప్టెన్సీ వస్తే.. అది చరిత్రే. ఆ చరిత్రే సృష్టించాడు క్రొయేషియా ఆటగాడు జాక్ వుక్‌సిచ్. 17 ఏళ్ల 311 రోజుల వయసు ఉన్న జాక్ వుక్‌సిచ్ అంతర్జాతీయ క్రికెట్‌లో యంగెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు.సైప్రస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో క్రొయేషియా జట్టుకు అతను కెప్టెన్‌గా వ్యవరిస్తున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 17 ఏళ్లకు కెప్టెన్ అయిన తొలి క్రికెటర్ కూడా అతనే. ఇంతకుముందు 2022లో ఫ్రాన్స్‌కు చెందిన నొమన్ అమ్జాద్ 18 ఏళ్ల వయసులో కెప్టెన్‌గా వ్యవహరించాడు. తాజాగా అతన్ని జాక్ వుక్‌సిచ్ అధిగమించి కొత్త చరిత్ర లిఖించాడు. గతేడాది బెల్జియంపై అతను అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.


Next Story