- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు యాక్సిడెంట్‌లో రొనాల్డో ఫ్రెండ్ దుర్మరణం..!
కారు యాక్సిడెంట్‌లో రొనాల్డో ఫ్రెండ్ దుర్మరణం. భావోద్వేగానికి గురైన స్టార్ ఫుట్‌బాలర్.

దిశ, స్పోర్ట్స్: పోర్చుగల్ ఫార్వర్డ్, స్టార్ ఫుట్‌బాలర్ డియాగో జోటా రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. పదిరోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఈ 28 ఏళ్ల స్టార్ ఫుట్‌బాలర్.. కారు ప్రమాదంలో కన్నుమూశాడు. పాతికేళ్ల అతని తమ్ముడు ఆండ్రీ సిల్వా కూడా ఈ ప్రమాదంలో మరణించాడు. తన టీంమేట్ ఇలా మరణించిన వార్తపై ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఇదసలు నమ్మలేకపోతున్నా’ అంటూ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు పెట్టాడీ దిగ్గజం. ‘మనం జాతీయ జట్టులో కొన్నిరోజుల క్రితమే కలిసి ఆడాం. నీకు జస్ట్ పెళ్లయింది. నీ కుటుంబానికి, భార్యాపిల్లలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్టకాలంలో ప్రపంచంలో ఉండే శక్తి అంతా వారికి దక్కాలని కోరుకుంటున్నా. డియాగో, ఆండ్రీ.. మేం మిమ్మల్ని చాలా మిస్ అవుతాం’ అని రొనాల్డో పోస్టు పెట్టాడు. రొనాల్డో, డియాగో ఇద్దరూ పోర్చుగల్ జాతీయ జట్టుతోపాటు లివర్‌పూల్ క్లబ్‌కు కూడా కలిసి ఆడారు.






