- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెటర్లు న్యూడ్ ఫొటోలు పంపేవారు.. సంచలన విషయాలు బయటపెట్టిన కోచ్ కూతురు
భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన విషయం తెలిసిందే. హార్మోనల్ రిప్లేస్‌మెంట్ థెరఫీ చేయించుకున్నానని, ఇకపై తనను అనయగా పిలువాలని గతేడాది వెల్లడించింది. ప్రస్తుతం ఆమె బ్రిటన్‌లో నివసిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లింగ మార్పిడి సర్జరీ చేయించుకున్న తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అనయ వెల్లడించింది. ఈ సందర్భంగా సంచలన విషయాలు బయటపెట్టింది.
కొందరు క్రికెటర్లు తనకు న్యూడ్ ఫొటోలు పంపించేవారని తెలిపింది. ‘నాకు 8-9 ఏళ్లు ఉన్నప్పుడు నేను మా అమ్మ దుస్తులను ధరించేదాన్ని. అద్దంలో చూసుకుని ‘నేను అమ్మాయిని. అమ్మాయిలా ఉండాలనుకుంటున్నా.’ అని అనుకునేదాన్ని. ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైశ్వాల్ వంటి క్రికెటర్లతో ఆడాను. మా నాన్నకు మంచి పేరు ఉన్న కారణంగా నా గురించి గోప్యత పాటించేదాన్ని. వరల్డ్ క్రికెట్‌లో అభద్రత ఉందని, పురుష అహంకారం ఉంది.’అని తెలిపింది.
అమ్మాయిగా మారిన తర్వాత పలువురి క్రికెటర్ల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కున్నానని అనయ వెల్లడించింది. ‘కొందరు క్రికెటర్లు నాకు వారి న్యూడ్ ఫొటోలు పంపేవారు. ఓ వ్యక్తి పక్కన కూర్చుని ఫొటోలు అడిగేవాడు. నా పరిస్థితిని ఓ సీనియర్ క్రికెటర్‌కు చెప్పా.అతనేమో ‘కారులో వెళ్దాం. నీతో పడుకోవాలని ఉంది.’ అని అడిగాడు.’ అని అనయ సంచలన విషయాలు బయటపెట్టింది. తండ్రి అడుగుజాడల్లో నడిచిన అనయ లింగ మార్పిడి సర్జరీ చేయించుకోక ముందు అబ్బాయిలతో కలిసి ఏజ్ గ్రూపు క్రికెట్ ఆడింది. స్థానిక క్లబ్ క్రికెట్‌లో ఇస్లాం జింఖానాకు ఆడింది.లీసెస్టర్‌షైర్‌లోని హింక్లీ క్రికెట్ క్లబ్‌కు కూడా ఆడింది. అయితే, 2023 నవంబర్‌లో ఐసీసీ మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లను అనుమతించబోమని ప్రకటించింది.






