ఉజ్జయినిలో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ దంపతులు ప్రత్యేక పూజలు

by Ramesh Naini |

భారత టీ–20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆదివారం తన భార్య దేవిశా శెట్టితో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు.

ఉజ్జయినిలో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ దంపతులు ప్రత్యేక పూజలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత టీ–20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) ఆదివారం తన భార్య దేవిశా శెట్టి(Devisha Shetty), కుటుంబ సభ్యులతో కలిసి మధ్యప్రదేశ్‌లోని (Ujjain) ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ దంపతులు భక్తి భావంతో మహాకాళేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం సూర్య కుమార్ ఆలయ పరిసరాల్లో భక్తులతో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు. ఇటీవల సూర్య కుమార్ భారత జట్టుతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సందర్శనలో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ మేరకు తాజాగా మహాకాళేశ్వర ఆలయ అధికారులు వీడియోను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. కాగా, టీమ్ ఇండియా జట్టు అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ-20లు ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీం ఇండియా 2025 ఆసియా కప్ గెలిచిన స్ఫూర్తితో ఆస్ట్రేలియా సిరీస్ ఎలాగైనా గెలిచి తీరాలని టీమ్ భావిస్తోంది.

Next Story