గంభీర్ కు అగ్ని ప‌రీక్ష..అదే జ‌రిగితే, ప‌ద‌వి పోవ‌డం గ్యారెంటీ !

by velandi.Saikiran |

భార‌త హెడ్ కోచ్‌ గౌత‌మ్ గంభీర్ పై మనోజ్ తివారీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు

గంభీర్ కు అగ్ని ప‌రీక్ష..అదే జ‌రిగితే, ప‌ద‌వి పోవ‌డం గ్యారెంటీ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భార‌త హెడ్ కోచ్‌ గౌత‌మ్ గంభీర్ పై మనోజ్ తివారీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీ 20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ గౌత‌మ్ గంభీర్ అగ్ని ప‌రీక్ష అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ టోర్నమెంట్ లో భార‌త జ‌ట్టు అట్ట‌ర్ ఫ్లాఫ్ అయి, ఇంటి దారి ప‌డితే, గౌత‌మ్ గంభీర్ ప‌ద‌వి పోవ‌డం గ్యారెంటీ అంటూ హెచ్చ‌రించారు మ‌నోజ్ తివారీ. ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకుని, ముందుకు వెళ్లాలని సూచ‌న‌లు చేశారు.

టీ20 ప్రపంచ కప్ టోర్నమెంటు గ్రూప్ స్టేజిలోనే భారత జట్టు ఎలిమినేట్ అయితే వెంటనే గౌతమ్ గంభీర్ రాజీనామా చేయాల్సి వస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చాడు. అందరి కన్ను ఇప్పుడు గౌతమ్ గంభీర్ పైన ఉందని గుర్తు చేశారు. ఇక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై వేటు పడితే, వీవీఎస్ లక్ష్మణ్ కు అవకాశం రాబోతున్నట్లు మనోజ్ తివారీ అంచనా వేశారు. అదే సమయంలో భారత జట్టును తక్కువ అంచనా వేయకూడదని కూడా ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. సూర్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలోని భారత జట్టు చాలా బలంగా ఉందన్నారు. భారత్ ను ఓడించడం చాలా కష్టమని తెలిపారు.

Next Story