- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరల్డ్‌కప్‌లోకి ఇలా రావాలనుకోలేదు..ట్విస్ట్ ఇచ్చిన స్కాట్లాండ్
స్కాట్లాండ్ జట్టును తెరపైకి తీసుకువచ్చింది ఐసీసీ. అయితే ఈ నేపథ్యంలోనే క్రికెట్ స్కాట్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రూడీ లిండ్ బ్లేడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో చివరి క్షణంలో ఛాన్స్ దక్కించుకుంది స్కాట్లాండ్. భద్రతా కారణాల వల్ల ఐసీసీ నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంది. అయితే బంగ్లాదేశ్ తప్పుకున్న తరుణంలో ర్యాంకింగ్స్ ను ఆధారం చేసుకుని, స్కాట్లాండ్ జట్టును తెరపైకి తీసుకువచ్చింది ఐసీసీ. అయితే ఈ నేపథ్యంలోనే క్రికెట్ స్కాట్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రూడీ లిండ్ బ్లేడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అసలు ఈ అడ్డదారిన ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లోకి రావాలని అస్సలు అనుకోలేదని వివరించారు. అర్హత సాధించేందుకు ఒక ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. ఇలాంటి ఆహ్వానాన్ని ఎవరు ఇష్టపడబోరని ఎమోషనల్ అయ్యారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య ఈ టోర్నమెంట్ లోకి అడుగుపెట్టామని స్పష్టం చేశారు. ఇందులో తమ వంతు కృషి చేస్తామని వివరించారు. బంగ్లాదేశ్ జట్టుకు సానుభూతి తెలుపుతున్నట్లు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ట్రూడీ లిండ్ బ్లేడ్.






